ఆత్మకూర్ ఏం మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా ఏనుతుల భాస్క

 

యాదాద్రిభువనగిరి జనం సాక్షి):–
ఆత్మకూరు ఎం మండల కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం అధ్యక్షునిగా మండల పరిధిలోని టీ రేపాక గ్రామానికి చెందిన ఎనుతుల భాస్కర్ ను నియమిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్ గారు ఈరోజు ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మేరకు పనిచేసి కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దళితులను కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షింప చేయడానికి పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక దళిత వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రాము ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆదేశించడం జరిగింది. నూతనంగా నియమితులైన ఏనూతుల భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నేను చేసిన సేవలను గుర్తించి నన్ను ఆత్మకూరు ఏం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్ విభాగం అధ్యక్షునిగా నియమించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్ గారికి సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎసి విభాగం అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారికి డిసిసి అధ్యక్షులు అందెం సంజీవరెడ్డి గారికి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య గారికి, ఆత్మకూరు ఎం ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గారికి, జడ్పిటిసి కొడిత్యల నరేందర్ గుప్తా గారికి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి గారికి, పి ఎ సి ఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి,కపురాయిపల్లి ఎంపీటీసీ మరియాల వెంకటేశ్వర్లు గారికి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన పదవిని బాధ్యతగా భావించి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు వెంకటరెడ్డి, గడ్డమీద కృష్ణ, దేవరకొండ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు