గోదావరి ముంపు బాదితులను ప్రభుత్వమే ఆదుకోవాలి

 

టేకులపల్లి, ఆగస్టు 25( జనం సాక్షి ): చర్ల మండలంలోని గోదావరి ముంపు బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) టేకులపల్లి మండల కార్యదర్శి ధర్మపురి వీర బ్రహ్మచారి, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు జరుపుల సుందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరి ముంపు బాధితులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మాట తప్పకుండా గోదావరి పరివాహక ప్రాంత ముంపు బాధితులకు అందరికీ మెరక ప్రాంతంలో ఇంటి స్థలం ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు తక్షణమే మంజూరు చేయాలని, ముంపు బాధితులపై పోలీసుల దాడులను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.