రైతుల ఆత్మహత్యలను ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సూచించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయని వివరించారు. జిల్లాలోని భువనగిరి డివిజన్ లో ఆత్మహత్యలు చేసుకున్న 15 మంది రైతుల కుటుంబాలకు ఆర్డీవో కార్యాలయంలో పరిహారం చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతతోపాటు పలువురు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు. రైతులు అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.




