Wednesday, 4 November 2026

గణేష్‌ నిమజ్జనాలు కన్నుల పండువగా సాగుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఏ గల్లీ చూసిన… ఏ వాడల చూసిన పార్వతీ తనయుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఉత్సవాల్లో ఐదోరోజు భాగంగా పలు చోట్ల వినాయక నిమజ్జనం వైభవంగా కొనసాగుతోంది. అటూ ఖైరతాబాద్‌ భారీ గణనాధుడిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు.

ఖైరతాబాద్‌ త్రిశక్తిమయ మోక్ష గణపతిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భారీ గణనాధున్ని తిలకించేందుకు నగర నలుమూలల నుండే కాకుండా జిల్లాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కంటోన్మెంట్ పరిధి బోయినపల్లిలో రాణాప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధున్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దర్శించుకున్నారు. లంబోదరునికి ప్రత్యేక పూజలు చేశారు. అటు ముషిరాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ అడహక్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌ రెడ్డి గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

కరీంనగర్‌ జిల్లాలో వినాయకచవితి ఉత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో గణేష్‌ నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఆలయఆస్థానాచార్యుల ఆధ్వర్యంలో 11మంది రుత్వికులచే లక్ష్మీగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. మెట్పల్లిలో స్నేహాలయ ఫ్రెండ్స్ యూత్ ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయక నిమజ్జన నియమావళి వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. నల్లగొండ జిల్లాలో వినాయకచవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గణనాధునికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిస్తోంది. నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్యే గాదరీ కిషోర్‌ ప్రత్యేక పూజలు చేశారు.
అటు ఖమ్మం జిల్లాలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో గణపతి దేవుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. అశ్వరావుపేటలో ఐదవరోజు సందర్భంగా పలు గణపతి విగ్రహాలను నిమజ్జం చేశారు. గల్లీగల్లీలో ఊరేగింపు నిర్వహించి స్థానిక అంకమ్మ చెరువులో నిమజ్జనం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో గణేష్‌ నవరాత్రులు సంబురంగా సాగుతున్నాయి. మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయంలో గణనాథుని కూరగాయలు, పండ్లుతో శాకంబరి గణనాథుని గా అలకరించారు. చింతపండు వాడలో 18 అడుగుల వినాయకుణ్ణి భారి సెట్టింగ్ లతో అలంకరించారు. రెడ్డి కాలనీ లో భక్తులు రూపాయల నోట్లతో కాసుల వినాయకుని కొలువు దీర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *