హైదరాబాద్ సిటీ: ఆత్మహత్యల నివారణకు కాంటినెం టల్ ఆస్పత్రి క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్‌ను గురువారం క్లినిక ల్ సైకాలజిస్టు డాక్టర్ అనిత ఆరే ప్రారంభించారు. 16వ తేదీ వరకు వా రం రోజుల పాటు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందు కో సం ఆన్‌లైన్ ద్వారా కూడా సలహాలు సూచనలు అందిస్తామన్నారు. బాధలు, ఇబ్బందులు, నిరాశ, నిస్పృహలతో ఉన్నవారు ఫోన్ నెం: 040- 67192270కు ఫోన్ చేసి నేరుగా వైద్యులతో మాట్లాడవచ్చని వారు తెలి పారు. చిన్న చిన్న విషయాలకే కలత చెంది ఆత్మహత్యలు చేసుకుంటారని, కొద్దిగా ఆలోచించి మనస్సును తెలిక చేసుకుంటే మార్గాలు ఉంటా యని డాక్టర్ అనిత పేర్కొన్నారు.




