Wednesday, 4 November 2026

ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.   ముఖ్య నాయకులతో సన్నాహాక సమావేశం.

 

 

 

 

 

 

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.  శనివారం క్యాంప్ కార్యాలయంలో zp ఛైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి తో కలిసి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ఆత్మీయ సమ్మేళనాల విజయవంతం పై సన్నాహక సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సమ్మేళనంలో పాల్గొనేలా చూడాలన్నారు.  12న మంత్రి హరీష్ రావు ఆందోల్ మండల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొంటారని తెలిపారు.  సంగుపేటలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఉంటుందనరు.  మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు హాజరుకావాలని ఈ విషయంపై సీరియస్ గా అదృష్ట పెట్టాలని సూచించారు.  అనంతరం  ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయనున్న ఆత్మీయ సమ్మేళన ఏర్పాట్లను పరిశీలించారు .  ఆయన వెంట నియోజకవర్గంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు జడ్పిటిసిలు మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు