హుజూర్ నగర్ జూన్ 2 (జనంసాక్షి): అందరికీ ఆదర్శనీయుడు కామ్రేడ్ చింతలపూడి రాములు అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కామ్రేడ్ చింతలపూడి రాములు 38వ వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిజం సిద్ధాంతం నిజ జీవితంలో కూడా అనుసరించి ఆచరించిన మహానుభావుల్లో ఒకరు కామ్రేడ్ చింతలపూడి రాములు అన్నారు. ఆయన సర్పంచిగా పనిచేసిన కాలంలో హుజూర్నగర్ అభివృద్ధికి పునాదులు పడినాయి అన్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇప్పించడంలో, వారి సమస్యల పరిష్కారంలో చింతలపూడి రాములు పాత్ర మరువలేనిదన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి అనుసరినీయమని, ఆనాటి ఈ ప్రాంత ముఖ్య కమ్యూనిస్టు నాయకుల జీవితాలను డిజిటల్ హిస్టరీ రూపంలో తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లవుల రాములు, జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, చింతలపూడి విద్యాకర్, యల్లావుల రమేష్, ఎల్లావుల సీత, చింతకుంట్ల విజయ,గుండా రమేష్, పశ్య వెంకట్ రెడ్డి, ఇందిరాల వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, కొట్టు మోహన్ రావు, జడ వెంకన్న, కుడి తొట్టి స్వామి, చక్రాల స్టాలిన్, మీసాల గాంధీ పాల్గొన్నారు.
ఆదర్శనీయుడు చింతలపూడి – సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్




