Tuesday, 3 November 2026

తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పాత్ర మరువలేనిది – సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్

హుజూర్ నగర్ జూన్ 2 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పాత్ర మరువలేనిదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను సిపిఐ కార్యాలయం ఎదుట ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అమరుల ఆకాంక్షల నెరవేర్చే విధంగా పాలకులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లవుల రాములు, జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, చింతలపూడి విద్యాకర్, యల్లావుల రమేష్, ఎల్లావుల సీత, చింతకుంట్ల విజయ, గుండా రమేష్, పశ్య వెంకట్ రెడ్డి, ఇందిరాల వెంకటేశ్వర్లు, మామిడి వెంకటేశ్వర్లు, కొట్టు మోహన్ రావు, జడ వెంకన్న, కుడి తొట్టి స్వామి, చక్రాల స్టాలిన్, మీసాల గాంధీ పాల్గొన్నారు.