జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ సహజసిద్ద పుణ్యక్షేత్రమైన ఆదివరహస్వామి ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆలయ కమిటి కార్యనిర్వాహణాధికారి కాంతారెడ్డి, ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత, డైరెక్టర్లు, భక్తుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఆలయ హుండీ ఆదాయం రూ. 8,46,807లు వచ్చినట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలియజేశారు. ఈ హుండీ ఆదాయ లెక్కింపులో ఆలయ జూనియర్ అసిస్టెంట్ కలువల సంతు తదితరులు పాల్గొన్నారు.




