భైంసా రూరల్ మార్చ్ 25జనం సాక్షీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహిషా నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇందూర్ విభాగ్ Sfd కన్వినర్ గంగా ప్రసాద్ మాట్లాడుతూ 10th, ఇంటర్ మరియు TSPSC పేపర్ లీక్ సర్వసాధారణం అని మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే విద్యార్థుల్లోకానికి మరియు నిరుద్యోగులకి క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని తెలియజేశారు అలాగే రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ కి ఇచ్చిన విధంగా సిట్ నోటీసులు మంత్రులు కేటీఆర్ మరియు ఇంద్రకరణ్ రెడ్డి కి కూడా సిట్ నోటీసులు ఇవ్వాలని,TSPSC ప్రక్షాళన చేయాలని మరియు TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి మరియు సెక్రెటరీ రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని అక్రమ కేసులకి భయపడమని హెచ్చరించారు. అలాగే కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ ,మనోజ్ ,శైథిర్షుల ,చక్రధర్, శంకర్,మరియు తదితరులు పాల్గొన్నారు.
TSPSC పేపర్ లీక్ సర్వ సాధారణం అని మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విద్యార్ధి లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్




