Wednesday, 4 November 2026

ఆదిలాబాద్‌ జిల్లాలో అధికంగా వర్షాలు

70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి
ఆదిలాబాద్‌: జిల్లాలోని అసిఫాబాద్‌లో విస్తరంగా వర్షాలు కురిశాయి. దాంతో 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భారీవర్షం కారణంగా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను అధికారులు రద్దుచేశారు. వాంకిడి మండలంలో ఎడతెరిపిలేని వానతో మూడు విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కాగజ్‌నగర్‌ మండలంలో 14.8సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. బెజ్జూరు మండలం కుషాన్‌పల్లిలో పెద్దవాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌ భారీ వర్షం కురిసి రంహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సారంగపూర్‌ మండలం వంజర్‌ వద్ద వరద ఉద్ధృతికి రోడ్లు తెగిపోవడంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *