Friday, 6 November 2026

ఆదిలాబాద్‌ జిల్లాలో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరా

ఆదిలాబాద్‌: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆదిలాబాద్‌ జిల్లాలో సగం మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు రాత్రి నుంచి అంధకారంలోనే ఉండిపోయారు. ఎల్లారెడ్డిపేట వద్ద 133కేవీ స్తంభాలు వర్షానికి నేల కూలడంతో ఆదిలాబాద్‌తోపాటు బోధ్‌, నిర్మల్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ తదితర నియోజకవర్గాల్లోని 20మండలాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *