జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదివారహ స్వామి దేవాలయాన్ని శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్ ను ఆలయ డైరెక్టర్ దండే కనక రత్నం శ్రీ ఆదివరహస్వామి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామానందం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివరాహస్వామిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు




