Thursday, 5 November 2026

ఆదివరాహ స్వామిని దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దంపతులు

జనం సాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం లోని ప్రముఖ దేవాలయమైన ఆదివరహ స్వామిని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు కలకుంట్ల వరప్రసాద చార్యులు ఎమ్మెల్యే దంపతులకు స్వామి వారి విగ్రహ ప్రతిమ ఫొటోను అందజేసి శాలువా కప్పి సత్కరించారు. అలాగే ఆదివారం కావడంతో ఆదివారహా స్వామి దేవాలయానికి దూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.