Thursday, 5 November 2026

స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్న చత్రపతి శివాజీ యువసేన

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ సేవా సంస్థ ఛత్రపతి శివాజీ యువసేనకు అరుదైన స్ఫూర్తి పురస్కారం దక్కింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి 30వ వార్షికోత్సవం పురస్కరించుకొని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సేవలందిస్తున్న పలువురిని గుర్తించి స్ఫూర్తి పురస్కారానికి అ సంస్థ ప్రతినిధులు ఎంపిక చేయగా అందులో ఛత్రపతి శివాజీ యువసేన కు చోటు దక్కింది. దీనిలో భాగంగా ఈ స్ఫూర్తి అవార్డును అధ్యక్షుడు జంగపెల్లి సతీష్ కుమార్ , ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ కి హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో ఆదివారం రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ చేతుల మీదుగా సన్మానం చేసి అవార్డు ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వసుందర విజ్ఞాన వికాస మండలి వ్యవస్థాపకులు వైద్యుల మధు ధర్మ రెడ్డి , వర్కింగ్ ప్రెసిడెంట్ కట్కూరి శంకర్, అధ్యక్షుడు చవుడు వెంకట రెడ్డి , ప్రముఖ ఆధ్యాత్మిక గురు దైవజ్ఞ శర్మ , పలువురు రచయితలు, కవులు, అధిక సంఖ్య లో పాల్గొన్నారు.