Wednesday, 4 November 2026

ఆదివాసీ సేన మహ సభను విజయవంతం చేయాలి. మహాసభలవాల్ పోస్టర్లు విడుదల

 

 

 

 

 

 

 

 

గుడిహత్నూర్: ఏప్రిల్ 7 (జనం సాక్షి)ఆదివాసిసేన తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్ రావు మెుకాశి పిలుపునిచ్చారు.శుక్రవారం మండలంలోని రాఘపుార్ గ్రామ పంచాయతీ పరిధిలోని పూనగుాడ గ్రామంలో ఆదివాసి సేన మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఆదివాసి గ్రామపటేల్ తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ నెల 29,30 తేదీలలో గుడిహత్నూర్ మండల కేంద్రంలో జరిగే రాష్ట్ర తృతీయ మహాసభలను ఆదివాసులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చుతూ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోడు భూములను సాగు చేస్తున్న ఆదివాసులకు ఎలాంటి షరతులు లేకుండా పట్టాలివ్వాలన్నారు. అనంతరం గ్రామపటేల్ లతో కలిసి మహాసభ గోడ ప్రతులను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు ఉయిక లక్ష్మణ్, పేందోర్ జయరాం, అత్రం భీంరావు, రాయిసిడాం జంగు, దశరథ్, విశ్వనాధ్, మండల అధ్యక్షుడు భీంరావు,శ్యాంరావు, తదితరులు పాల్గొన్నారు.