Wednesday, 4 November 2026

ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తాయి-బీర్ల అయిలయ్య

 

 

 

 

 

 

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ ఏప్రిల్ 07//ఫోటో రైటర్  01 తుర్కపల్లి జోడో యాత్రలో మాట్లాడుతున్న దృశ్యంఇంద్రమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండలం దయ్యం బండ తండా ,మంచి రోజు మామిళ్లు ,తుర్కపల్లి మండల కేంద్రం, జెతిరామ్ తండా, ములకలపల్లి గ్రామాల్లో రెండో రోజు హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడప గడపకు వెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 కే గ్యాస్ అందిస్తామని ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మా ఫౌండేషన్ ద్వారా వాటర్ క్యాన్లు అందజేస్తామని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందనుకుంటే ప్రజలు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు.ప్రతి గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లులే ఉన్నాయని తెలిపారు.మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని వస్తే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. బీర్ల ఫౌండేషన్ తో నియోజకవర్గంలో అనేక రకాలుగా సేవ కార్యక్రమాలు చేస్తున్నామని,నాలుగు అంబులెన్స్ ల తో ఎవరికి ప్రమాదం జరిగిన వారిని ఆస్పత్రికి చేర్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఏలగల రాజయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి మధుసూదన్ రెడ్డి, ఓబీసీ జిల్లా చైర్మన్ రాహుల్ గౌడ్ ,యదగిరి గుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కనుగు బాలరాజు గౌడ్ ,తుర్కపల్లి మండల అధ్యక్షుడు  ధనావత్ శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి ,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధనావత్ భాస్కర్ నాయక్ ,ఎంపీటీసీలు బోరెడ్డి వనజ హనుమంత రెడ్డి ,కానుగంటి శ్రీనివాస్ యాదవ్, ప్రతిభ రాజేష్, మోహన్ బాబు ,మాజీ సర్పంచ్ సోమోల వెంకటేష్ ,మండల మహిళా అధ్యక్షురాలు అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, నాయకులు వెంకటేష్ గౌడ్, ఆకుల సతీష్ కుమార్, పసుల సత్యనారాయణ, సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.