ఆదిశిల క్షేత్రాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నకేశవరెడ్డి
మల్దకల్ నవంబర్ 28 (జనంసాక్షి)పి ఆర్ టి యు తెలంగాణ అధికారిక ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సోమవారం దర్శించుకున్నారు.మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు క్రాంతి కుమార్ సమక్షంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో పి ఆర్ టి యు అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బుచ్చా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ,గౌరవ అధ్యక్షుడు నరసింహారెడ్డి మండల అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి ,నరసింహులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి సలాం,రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు మండల బాధ్యులు ప్రాథమిక సభ్యులు పాఠశాల ఉపాధ్యాయ బృందము తదితరులు పాల్గొన్నారు.




