Saturday, 7 November 2026

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

– టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి రత్నవత్ వంశీ

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి రత్నవత్ వంశీ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని 60ఫీట్ల రోడ్డులో బిఎన్ రెడ్డి విగ్రహం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గత మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ , స్కాలర్ షిప్ నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల హామీ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయాలని కోరారు.రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలన్నారు.విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ పట్టణ అధ్యక్షులు మరిపెల్లి మనోజ్ , సైదులు , రాజేష్ , కల్యాణ్, అనిల్, మహేష్ , నవ్య, హారిక, దర్శిని తదితరులు పాల్గొన్నారు.