ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

బచ్చన్నపేట (జనం సాక్షి) జూలై 11:
జనగామ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశం మేరకు బచ్చన్నపేట మండలంలోని మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ బచ్చన్నపేట స్కూల్ నందు ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ తేజావత్ మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ. ఈ యొక్క ఆధార్ నమోదు కేంద్రాన్ని బచ్చన్నపేట మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయడం కొరకు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు స్వదునియోగం చేసుకోవాలని కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు కేజీబీవీ ఎస్ఓ ప్రధానోపాధ్యాయులు ఆధార్ ఆపరేటర్ జ్యోతి రాజేష్ భానుచందర్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు

తాజావార్తలు