గ్రామాల అభివృద్దే ద్యేయం-మంత్రి మల్లారెడ్డి

శామీర్ పేట్, జనంసాక్షి :నియోజకవర్గం లోని గ్రామాల మౌళిక వసతుల కల్పనకు అహర్నిశలు పాటుపడున్నానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ముడుచింతలపల్లి మండలం అద్రాస్ పల్లి,ఉద్దేమర్రి, కేశవపూర్, అనంతరం గ్రామాలలో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర చేశారు.
గ్రామస్తులతో కలిసి మాట్లాడి సమస్యలనుతెలుసుకొని అతి త్వరలో అన్ని సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.కేశవపూర్ గ్రామంలో 1కోటి సీసీ, బిటి రోడ్లను ప్రారంభించారు .
గ్రామాలలో స్వంత నిధులతో సీసీ రోడ్లు, గుడులు,సంఘల భవనాలు, నిర్మాణం చేపదాతనని హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమలలో మేడ్చల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఏ ఎం సి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,స్థానిక సర్పంచ్లు, మురళి గౌడ్, హరిమోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు