Wednesday, 4 November 2026

ఆధునిక సౌకర్యాలతో నూతన బస్సులు సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్ లు

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో ఆధునిక బస్సులను ప్రవేశపెట్టినట్లు  మిర్యాలగూడ ఆర్టీసీ డిఎం బి పాల్ తెలిపారు. సోమవారం మిర్యాలగూడ బస్ డిపో చేరిన నూతన బస్సులను  రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసిన అనంతరం ప్రయాణికులకు   అందుబాటులో వచ్చినట్లు తెలిపారు. నూతన బస్సులలో   గల సౌకర్యాలు వాటర్ బాటిల్ పెట్టుకొనే సదుపాయం. మొబైల్ ఛార్జింగ్ సదుపాయం. వెహికల్ ట్రాకింగ్ సిస్టము, మరియు పానిక్ బటన్ సదుపాయము కలదని . బస్సులో రెండు సీసీ కెమెరాలు వాటి పరిశీలన డ్రైవర్  క్యాబిన్ యందు ఉంటుందన్నారు. బస్సు ముందు వెనక ఎల్ఈడి బోర్డుల యందు గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి  బస్సులో ఫైర్ డిటెక్షన్ సిస్టం కూడా ఏర్పాటు చేయబడిందని వివరించారు. సురక్షితమైన ప్రయాణాలకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆయన కోరారు.