ఏర్గట్ల ఏప్రిల్ 10 (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. వీరిలో అధ్యక్షులుగా కొలిప్యాక రవి,ఉపాధ్యక్షులుగా జక్కుల నడ్పి భూమన్న, కోశాధికారిగా ఇబ్రహీంపట్నం దేవుడు నరసయ్య, ఖాతాదారుడుగా రాజారపు నరేష్ లు ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు కోల రమేష్ గౌడ్, కామన్ శివకుమార్, బద్దం లింబాద్రి, కూరాకుల బాలరాజ్, మునిమాణిక్యం సంతోష్, నలిమెల శ్రీనివాస్, అహమ్మద్, దోబ్బల లక్ష్మణ్, కుమ్మరి అశోక్, రేండ్ల చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న గ్రామ కమిటీ




