Tuesday, 3 November 2026

ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో మోసం

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో ఓ నర్స్‌ను మోసగించిన నైజీరియన్లకు ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సంకెళ్లు వేశారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన చెవుల అంజమ్మ మహారాష్ట్రలోని లాతూర్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్నారు. న్యూ ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఉంటున్న నైజీరియన్లు మీరు లాటరీలో గెలుపొందారని ఆమెకు మెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు పంపారు. ఫోన్లో మాట్లాడి లాటరీ సొమ్ము బదిలీ ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఆమె వద్ద నుంచి 4.54 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో బాధితురాలు ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన సైబర్‌ క్రైమ్స్‌ విభాగం ఎస్పీ క్రాంతిరాణా టాటా ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఢిల్లీలో ఉన్న నిందితులు ఓసాజి మైక్‌ ఓడియన్‌ అలియాస్‌ ఫిలిప్స్‌, ఓస్సాయ్‌ జార్జ్‌ ఒడుగుతోపాటు మరో మహిళ రోజ్‌ నకిష్టి అలియాస్‌ రియా గుప్తాను అరెస్టు చేసింది. నిందితుల ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు సీజ్‌ చేశామని, ఇటువంటి ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్‌ వస్తే తమకు సమాచారం ఇవ్వాలని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమలరావు ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *