హైదరాబాద్ సిటీ: స్వైన్ ఫ్లూతో మరో ముగ్గురు ఆస్పత్రుల్లో చేరారు. ఇటీవల నాసిక్ వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన ఓ 42 ఏళ్ల వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. జ్వరం, జలుబు, దగ్గు విపరీతంగా ఉండటం తో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. నము నాలు సేకరించి నిర్ధారణ చేయగా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలిం ది. దీంతో అతని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నారు. ఫ్లూ లక్షణాలతో తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో మ హిళ(38), సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో 46 ఏళ్ల వ్యక్తి చేరారు. వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా వైర స్ ఉన్నట్లు తేలింది. దీంతో ఫ్లూ చికిత్సలు అందిస్తున్నారు.




