Tuesday, 3 November 2026

హెల్మెట్‌ ఉంటేనే కొత్త ద్విచక్రవాహనం రిజిస్ర్టేషన్‌

ic2auqn0హైదరాబాద్‌ సిటీ: హెల్మెట్‌ ఉంటేనే కొత్త ద్విచక్రవాహనం రిజిస్ర్టేషన్‌ చేస్తారు. శుక్రవారం నుంచి గ్రేటర్‌ పరిధిలోని అన్ని రవాణా కార్యాలయాల్లో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నారు. ఇందు కోసం రవాణాశాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పుల చేస్తున్నారు. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌ లేదా ఇతర షాపుల నుంచి ఐఎస్‌ఐ మార్కు ఉన్న హెల్మెట్‌ కొన్నట్టు రసీదు చూపిస్తేనే వాహనం రిజిస్ర్టేషన్‌ చేస్తారు. ఇది తప్పకుండా పాటించాల్సిందేనని హైదరాబాద్‌ జిల్లా సంయుక్త రవాణా కమిషనర్‌ టి.రఘునాథ్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదాల గణాంకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్రవాహనదారులే మృత్యువాతపడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ కార్యాలయంలో హెల్మెట్‌ నిబంధనపై జిల్లా అధికారులతో గురువారం సమావేశం నిర్వ హించి ఈ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. హెల్మెట్‌ వాడకంపై వాహనదారుల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలను రవాణా శాఖ చేపడుతుందన్నారు. ఈ నిబంధనలను పూర్తిగా అమలుచేసిన తర్వాతే రవాణాశాఖ, ట్రాఫిక్‌ పోలీసులు హెల్మెట్‌ వాడని వాహనదారులకు జరిమానా విధిస్తారని జేటీసీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *