Wednesday, 4 November 2026

ఆపదలో అండగా ఉంటా డిప్యూటీ మేయర్మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన రెడ్డి శెట్టి శ్రీనివాస్

 

 

 

 

 

 

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 8 :-.  ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఉన్న సంతృప్తి మాటలతో వర్ణించలేనిదని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ ప్రాంతంలో గల పాపయ్య కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మారెడ్డి అనే వ్యక్తి చిన్న కుమారుడు అనారోగ్యంతో శనివారం మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా బాధిత కుటుంబాన్ని సందర్శించి బాధితులను పరామర్శించి బాలుని దహన సంస్కారాల కోసం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కోటి పూజలు చేసి కొడుకును కన్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసి ఏడు సంవత్సరాల వయసులోనే బాలుడు మృతి చెంది తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగల్చడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మానవ మనుగడలో పుత్రశోకం భరించలేనిదని దిగ్భ్రాంతికి గురయ్యారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు బాధితుల బంధుమిత్రులు కాలనీవాసులు తదితరులు ఉన్నారు