బిచ్కుంద ఏప్రిల్ (జనంసాక్షి)కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పంచాయతీలకు నిధులు భారీగా కేటాయిస్తుందని కానీ భారత రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు గత 8 నెలల నుండి నిధులు నిలిపివేసిందని కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల పంచాయతీ సెక్రటరీ లక్ష్మణ్ అన్నారు. పంచాయతీ సిబ్బందికి మరియు పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వక సతమతమవుతున్నామని వాపోయారు. పంచాయతీ కార్యాలయం మేయింటెనెన్స్ కు కష్టమవుతోందని ఈయనే కాకుండా అనేక గ్రామ పంచాయతీల సర్పంచులు సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక లక్షల రూపాయల బాకీ చేసి అభివృద్ధి చేశామని సర్పంచులు వార్డు సభ్యులు ఎంపీటీసీలు మొర పెట్టుకుంటున్నారు. గతంలో స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నిధులు ఏప్రిల్ కంటే మొదలే విడుదల చేస్తామని మంత్రులు హరీశ్ రావు మరియు కేటీఆర్ అన్నారని, ఇప్పటివరకు ఆ నిధుల జాడ లేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంచాయతీ బకాయిలను చెల్లించి మరింత పంచాయతీల అభివృద్ధికి పాటు పడాలని ఆశిద్దాం.




