ఆపదలో ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు..
– కాంగ్రెస్ మండల నాయకులు.
ఊరుకొండ, డిసెంబర్ 10 (జనంసాక్షి):
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి అనీ కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. శనివారం ఊర్కొండ మండలంలోని గుడిగానిపల్లి గ్రామానికి చెందిన పోలె ఆంజనేయులు(25) కుటుంబ కలహాలు, ఇబ్బందుల వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక సర్పంచ్ రజిత కృష్ణయ్య మాట్లాడుతూ.. మండలంలో ఎంతమంది నాయకులు ఉన్న తనదైన శైలిలో ప్రజల్లో మమేకమైతు ఎక్కడ ఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ భరోసానిస్తున్న ఏకైక వ్యక్తి డిఎన్ఆర్ అని ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఆపదలో ఆదుకుంటున్న ఇలాంటి వ్యక్తి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రజలు దీవెనలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జోగు శ్రీపతి, జంగయ్య, రవి, రమేష్, రామచంద్రయ్య, వెంకట్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు.. – కాంగ్రెస్ మండల నాయకులు




