Friday, 6 November 2026

ఆపదలో ఉన్నవారికి ఆర్ధికసాయం

ఆపదలో ఉన్నవారికి ఆర్ధికసాయం..
– కాంగ్రెస్ నాయకులు.
ఊరుకొండ, డిసెంబర్ 7 (జనంసాక్షి):
ఆపదలో ఉన్నవారికి తన వంతు ఆర్థిక సాయం చేయడంలో మాథారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం మండలంలోని మాధారం గ్రామానికి చెందిన కాళ్ళ హనుమయ్య(50) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా డి ఎన్ ఆర్ యువసేన సభ్యులు మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు ఆపదలో ఆదుకుంటున్న ద్యాప నిఖిల్ రెడ్డి కి గ్రామస్తులు ఎల్లవేళలా అండగా ఉంటామని, మాకు ఇలాంటి నాయకుడు ఉండటం మా గ్రామ ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారని పేర్కొన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చిన ముందుకు వచ్చి నేనున్నానంటూ ఆదుకుంటున్న మనసున్న మహారాజుకు ప్రజల దీవెనలు ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డి ఎన్ ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.