Tuesday, 3 November 2026

ఆఫ్ఘాన్‌లో మరణించిన రాష్ట్ర వాసులకు సంతాపం తెలిపిన చంద్రబాబు

హైదరాబాద్‌ : ఆఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన రాష్ట్ర వాసులు గురుడు నవీన్‌, చిత్తకుంట సందీప్‌ల మృతికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఉపాధి కోసం వెళ్లిన వారిపై తాలిబన్‌ల దాడిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని కోరారు. నవీన్‌, సందీప్‌ల మృతదేహాలు వారి స్వస్థ లాలకు త్వరగా చేరుకునేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *