ఆయిల్ ఫాం తోట లతో అధిక లాభాలు..ఆయిల్ ఫాం తోట లతో అధిక లాభాలు..
-ఆర్టికల్చర్ అధికారి శ్రీనివాసాచారి..
గద్వాల రూరల్ నవంబర్ 25 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని భీంపురం,చింతరేవుల గ్రామాలలో ఆయిల్ ఫాం సాగుపై ధరూర్ మండల వ్యవసాయ శాఖ ఏఈఓ స్వరూప అధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ఆర్టికల్చర్ అధికారి శ్రీనివాసాచారి హాజరై రైతులతో మాట్లాడుతూ ఆయిల్ ఫాం సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నాడు…ఆయిల్ ఫాం పంటలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలని,ఆయిల్ ఫాం సాగుపై రైతులు దృష్టి సాధించాలని సూచించారు…కార్యక్రమంలో హెచ్.ఓ.శివకుమార్.. వ్యవసాయ విస్తీర్ణ అధికారిణి స్వరూప రాణి, జైన్ కంపెనీ ఉపేంద్ర,మహేంద్ర కంపెనీ ప్రతినిధి దయాకర్ రైతులు.. గ్రామస్థులు పాల్గొన్నారు..




