రంగంపేటకు రాత్రిపూట బస్సులు సౌకర్యం ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు..?రంగంపేటకు రాత్రిపూట బస్సులు సౌకర్యం ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు..?
రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్
జనం సాక్షి /కొల్చారం మండలంలోని మెదక్ డిపాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రంగంపేటలో ఈనెల 16వ తేదీన మెదక్ ఆర్టీసీ ఆధ్వర్యంలోప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమం నిర్వహించగా రంగంపేట గ్రామ సర్పంచ్ బండి సుజాత రమేష్ విద్యార్థులు, ప్రయాణికుల సౌకర్యార్థం మెదక్ నుండి చివరి బస్సు రాత్రి 9 గంటలకు బయలుదేరేలా వేయాలని కోరారు. దీంతో మండలములోని పోతంశెట్టిపల్లి, చిన్న ఘనాపూర్ రంగంపేట,దుంపలకుంట ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఇందుకు మెదక్ డిపో మేనేజర్ రవి చందన్ గత రెండు రోజుల నుంచి రాత్రి 9 గంటలకు మెదక్ నుండి బయలుదేరి 9:30 గంటలకు రంగంపేట స్టేజ్ వద్దకు చేరుకుంటుంది. దీంతో గురువారం రాత్రి మెదక్ డిపో నుంచి బస్సు రంగంపేట స్టేజి వరకు రాగానే, సర్పంచ్ ఆధ్వర్యంలో రంగంపేట గ్రామస్తులందరూ బస్సు డ్రైవర్ ,కండక్టర్ కు స్వీటు తినిపించి టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు పలువురు నాయకులు డిపో మేనేజర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




