Tuesday, 3 November 2026

ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రభుత్వ రాయితీ అందిస్తుంది..

శంకరపట్నం: జనం సాక్షి మే 29
ఆయిల్ ఫామ్ ఫామ్ పంట సాగు చేస్తే ప్రభుత్వం రాయితీ అందిస్తుందని, అధిక దిగుబడులు పొందవచ్చని, మండల వ్యవసాయ శాఖ అధికారి రాచకొండ శ్రీనివాస్, ఉద్యానవనాధికారి మంజు వాణి అన్నారు. సోమవారం మండలంలోని కన్నాపూర్ ,మొలంగూర్ గ్రామాల్లో గల రైతు వేదికల్లో రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కల్పించి ప్రభుత్వ రాయితీలను వివరించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు కాటం వెంకట రమణారెడ్డి , పంజాల రేణుక రాజయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ నిమ్మశెట్టి వీరస్వామి, జిల్లా కోఆర్డినేటర్ అంతం తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల ఏఈవోలు రైతులు తదితరులు పాల్గొన్నారు.