శంకరపట్నం: జనం సాక్షి మే 29
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం లో ధాన్య విక్రయించిన రైతులకు నెల రోజులు కావస్తున్న ధాన్యము డబ్బులు జమ కాకపోవడంతో సోమవారం మండలంలోని మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని ఆముదాలపల్లి గోదాం ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, మెట్ పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆముదాలపల్లి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్య విక్రయించి1 నెల కావస్తున్న ధాన్యము డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడం లేదని, దీంతో వానాకాలం పంట సాగు చేసేది ఎట్లా ,పెట్టుబడికి ఒక్క రూపాయి కూడా లేదని, ఇప్పటికైనా రైతులకు వరి ధాన్యము డబ్బులను ప్రభుత్వము జమ జమ చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.
నెలలు గడుస్తున్న వడ్ల డబ్బులు వస్తలేవు… గోదాం ఎదుట రైతుల నిరసన




