Wednesday, 4 November 2026

ఆరెకుల సంక్షేమ సంఘం విద్యార్థులకు ప్రతిభా ..పురస్కారాలు

ఎల్కతుర్తి జూన్ 21 జనం సాక్షిఎల్కతుర్తి: మండల కేంద్రంలోని ఆరెకుల సంక్షేమ సంఘం మండల కమిటీ, ఆధ్వర్యంలో, ఎల్కతుర్తి లోని ఎస్ ఏం ఆర్ గార్డెన్ లో ,ఆరెకుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కుడితాడి రాజు అధ్యక్షతన మండలంలోని పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఆరెకుల సంక్షేమ సంఘం విద్యార్థిని,విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు హిం గే శివాజీ, జిల్లా ఉపాధ్యక్షులు సుకిని సుధాకర్ రావు హింగే భాస్కర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హింగే భాస్కర్ మాట్లాడుతూ, చదువుకు ఆర్థిక స్తోమత అడ్డుకాకూడదు అని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని, అందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు చదువుతోపాటు సంస్కారంను కూడా అలవాటు చేసుకొని, తల్లిదండ్రులను గౌరవిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని విద్యార్థిని,విద్యార్థులను శాలువా మెమెంటో లతో సత్కరించారు. ఈ సమావేశంలో , మండల ప్రధాన కార్యదర్శి, హింగే రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షులు రవి, ఫిరోజ్,నర్సింగరావు,మల్లయ్య, కిషన్ రావు, ఎనుకమూరి బిక్షపతి, సూపినే రామచంద్రరావు, మరియు గ్రామాలలోని అధ్యక్ష,కార్యదర్శులు, విద్యార్థిని,విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.