హైదరాబాద్: తెలంగాణప్రగతిలో అమరుల త్యాగనిరతి ప్రకాశిస్తున్నదని మంత్రి హరీశ్ రావుఅన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. అమరుల త్యాగం అజరామరమని, వారి స్ఫూర్తి ప్రజ్వలిత దీప్తి అని చెప్పారు. ఉద్యమ ధ్రువ తారలకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
అమరుల త్యాగం.. అజరామరం.. మంత్రి హరీశ్ రావు




