హైదరాబాద్,ఫిబ్రవరి28(జనంసాక్షి): ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు చలపతిరావు అన్నారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గుడ్ హెల్త్ షో పేరిట శనివారం అవిూర్‌పేట కమ్మసంఘం హాలులో వైద్య శిబిరం నిర్వహించింది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు చలపతిరావు హాజరయ్యారు. ఈ శిబిరంలో హృద్రోగ నిపుణులు, మదుమేహం, రక్తపోటు తదితర వ్యాధి నిపుణులు పాల్గొన్నారు. దంతవైద్యులు, కన్ను, చెవి, ముక్కు, వూపిరితిత్తులు, మూత్రపిండాలు తదితర విభాగాల నిపుణులతో పాటు ¬మియోపతి నిపుణులు పాల్గొని శిబిరానికి వచ్చినవారిని పరీక్షించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.




