ఆరోగ్యకరమైన హాస్యానికి ఎల్లప్పుడు ఆదరణ ఉంటుంది

శాంతినగర్ కు చెందిన కవి, రచయిత షేక్ అస్లాం షరీఫ్ 108 జోకులతో రచించిన ” నవ్వులే నవ్వులు” జోక్స్ పుస్తకం ను ఆదివారం అనంతపురం లో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు, యూట్యూబర్ ,అబ్బా టీ వీ వ్యస్థాపకులు హరిప్రసాద్ గారు ఆవిష్కరించారు. అనంతరం తాను మాట్లాడుతూ ” నవ్వు ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఆరోగ్యకరమైన హాస్యానికి ఎల్లప్పుడు ఆదరణ ఉంటుందని, అస్లాం వ్రాసే జోక్స్ బాగుంటాయని, అతడి కలం నుంచి మరిన్ని రచనలు రావాలని ప్రభుత్వ వృత్తి లో ఉంటూ నిరాటకంగా రచనలు చేస్తున్న అస్లాం ను హరిప్రసాద్ అభినందించారు. అనంతరం పుస్తక రచయిత అస్లాం అబ్బా టీ. వీ. ద్వారా ప్రజలను నవ్విస్తున్న హరిప్రసాద్ ను శాలువా తో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్బా టీ. వీ. కళాకారులు సుధాకర్, శ్రీనివాస్, సుబ్బు, రామచంద్ర, మస్తాన్ పాల్గొన్నారు.

తాజావార్తలు