పద్మశాలి రాజకీయ యుద్ధభేరి సభ తరలిన మంథని డివిజన్ పద్మశాలీలు
జనంసాక్షి, కమాన్ పూర్ :ఆదివారం కోరుట్లలో జరిగిన పద్మశాలి రాజకీయ యుద్ధభేరి పద్మశాలి ఆత్మగౌరవ సభకు మంథని డివిజను లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల సుమారు ఆరువందల మంది పద్మశాలీలు బస్సులు, టాటాఏస్, కార్లు ద్వారా జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య, సర్పంచ్ తాటికొండ శంకర్, మాజీ జడ్పీటీసి/మాజీ సర్పంచ్ ఎల్లె శశిరేఖరామ్మూర్తి, మాజీ సర్పంచ్ కుందారపు బాపు, పద్మశాలి నాయకులు బండారి సదానందం, గూట్ల రమేష్, కొలిపాక సారయ్య, కుచన మల్లయ్య, మేర్గు వెంకటేశ్వర్లు,గూట్ల రవిందర్, చిందం సదానందం, దుస్స సారయ్య ఆధ్వర్యంలో భారీగా తరలిన పద్మశాలీయులు.శ్రావణమాసం కావడంతో, వ్యవసాయపనులున్నప్పటికి చాన్నాల్లనుండి భారీ కులసభలు నిర్వహించలేక పోయిన నిరుత్సాహంతో ఉన్నవారు, సంతోషాలతో, ఉత్సాహంగా బయలుదేరి విహార యాత్రలాగా భోజనాలు ఏర్పాటుచే సుకుని వేడుకగా సభకు హాజరైనారు.వీరిలో తుమ్మ మధుసూధన్, పరికిపండ్ల కోటేశం, పెండెం వెంకటేశం, బూర సుగుణ, ఊరగొండ రమాదేవి, దేవులపల్లి రాజేశ్వరిదుస్స సదాశివ, గుండేటి శ్రీమూర్తి, మేర్గు శ్రీనివాస్, మాటేటి రవి, మాటేటి రాజబాబు, బండి రాజేశం, బండి భూపేందర్, కొక్కుల కనకయ్య, సమ్మయ్య, వేముల సంపత్, రాంపల్లి నాగరాజు, కళ్యాణపు రాజు, దురిసెట్టి కుమార్, ఎలగందుల రమేష్, తదీతర పద్మశాలీయులు పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.