;-తెలంగాణఅన్ని రంగాలలో ప్రగతి పథంలో దూసుకెళ్తుంది
;-ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
;- జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి
;- సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 12 : -తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ, ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రం పయనిస్తుందని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు.
రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువజన, క్రీడల శాఖ భాగస్వామ్యంతో నిర్వహించారు.
సంగారెడ్డి ఎస్పీ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని ఎంపీ బీబీ పార్టీ జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఇట్టి రన్ లో ప్రజా ప్రతినిధులు, పోలీసులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువజన సంఘాలు, యువత,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బెలూన్ లు గాల్లోకి ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని, అన్ని రంగాలలో పురోగమిస్తూ, ఆరోగ్య తెలంగాణ దిశగా పయనిస్తుందన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు తీరాయన్నారు.
జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించిన రన్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తో పరిపాలన ప్రజలకు చేరువైందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసేలా ఫ్రెండ్లీ పోలీస్ గా మార్చారని గుర్తు చేశారు.
2014లో తాను ఉమ్మడి మెదక్ జిల్లా జేసీ గా పనిచేసిన సమయంలో రోడ్లు చాలా అద్వానంగా ఉండి ప్రయాణం బాదా కారంగా ఉండేదని, తాగు నీటికి, సాగునీటికి ప్రజలు కటకటపడేవారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత
కొత్త రోడ్ల నిర్మాణం, రోడ్ల పునరుద్ధరణలతో రోడ్లు బాగాయ్యాయని, మిషన్ భగీరథ తో తాగునీటి కష్టాలు తీరాయని,
మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్ ల నిర్మాణంతో జిల్లా లో భూగర్భ జలాలు పెరిగాయని,సాగు విస్తీర్ణం మూడంతులు పెరిగిందన్నారు. పంట దిగుబడి అదేవిధంగా పెరిగిందన్నారు.
సీఎం కప్ కు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రజలలో చైతన్యం వచ్చిందని,అన్ని కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారన్నారు.
జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ ఒకప్పుడు ఏదైనా సమస్య ఉందంటే సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చే వారిని, తెలంగాణ పోలీస్ లు అలాకాదని,
ఒక్క ఫోన్ కాల్ తో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, డిఆర్ఓ నగేష్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి,లైన్స్ క్లబ్ ప్రతినిధులు, వివిధ కేడర్ల పోలీస్ లు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, యువత, యువజన సంఘాలు, విద్యార్థులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.




