Tuesday, 3 November 2026

ఆరోగ్య మహిళా శిబిరం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పరిశీలకులు.

ఆరోగ్య మహిళా శిబిరం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పరిశీలకులు.
బూర్గంపహాడ్ మార్చి 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి స్పందన ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా శిబిరాన్ని (ఎన్ వి బి డి సి పి స్టేట్ కన్సల్టెంట్) రాష్ట్ర పరిశీలకులు ఎం సైదులు, పి ఒ- ఎన్ సి డి. డా. మణికంఠ రెడ్డి క్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర పరిశీలకులు క్యాంపు జరుగుతున్న తీరును పరిశీలించి, క్యాంపు కు రిజిస్ట్రేషన్, టెస్టులు, డాక్టర్ చెకప్ ఆన్లైన్ మరియు వారికి అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం 58 మందిని పరీక్షించి వారికి పాలు సూచనలు చేసి, మహిళాలందరూ ఆరోగ్య సేవలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి- ప్రోగాం ఆఫీసర్ డా. మణికంఠారెడ్డి – ఎ ఎమ్ డి. గోంది వెంకటేశ్వర్లు, జిల్లా. ఎన్ వి బి డి సి పి కన్సల్టెంట్ పి. క్రిష్ణయ్య, హెచ్ ఈ ఒ. బి. రవి, హెచ్ ఎస్. మూర్తి, హెచ్ వి. సడాల దేవి, పి హెచ్ సి సిబ్బంది పాల్గొన్నారు.