బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం: మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది.
బూర్గంపహాడ్ మార్చి 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక గోదావరి బ్రిడ్జి వద్ద నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ వాసి బౌల్ సింగ్ కుటుంబానికి మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది బియ్యం, నిత్యవసర వస్తువులు, బట్టలు, కొంత పైకము అందజేశారు. ఈ కార్యక్రమం లో మండల పరిషత్ జూనియర్ సహయకులు దుగ్గిరాల విజయలక్ష్మి, సీనియర్ సహయకులు గొడపర్తి రఘు, మండల పంచాయతీ అధికారి సునీల్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బంది పాల్గొని, వారు మాట్లాడుతూ 25 కేజీల బియ్యం దానం గా ఇచ్చి, ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సాహన్ని ఇచ్చిన విక్రమ్ సూపర్ మార్కెట్ భద్రాచలం, విక్రమ్ కి కృతజ్ఞతలు తెలియజేసారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం: మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది.




