ఝరాసంగం మార్చి 8 ( జనం సాక్షి ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగమ్ ప్రాథమిక ఆరోగ్య సెంటర్ లో ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని. ‘మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ అని నమ్మిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు.మహిళల సంక్షేమ కోసం ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో కార్యక్రమాలు కేసిఆర్ చేపట్టారని అన్నారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్, మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఆడబిడ్డలకు నీటి కష్టాలు తీరాయి అన్నారు.కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ మాజీ మండల అద్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, ఎంపీటీసీ రజినీ ప్రియ సంతోష్ పాటిల్,. సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్, విజేందర్ రెడ్డీ, రైతు సమన్వయ అద్యక్షులు సుభాష్ రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నర్సన్న పాటిల్, సర్పంచ్ సర్పంచ్ లు అమర్నాథ్, సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ లు రాజు, రాజు, మనయ్యా, పట్టణ మైనారిటీ అద్యక్షులు ఐజాజ్ బాబా, చైర్మన్ గౌసోద్దిన్, సీనియర్ నాయకులు పందరినాత్, నర్సింలు, వెంకట్ రెడ్డీ, ఇజ్రాయేల్ బాబీ, రవి కుమార్, సోహైల్, శివరాజ్, మూస పటేల్, సిద్దన్న పటేల్, రమేష్ పటేల్, పాండు ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంబించిన ఎమ్మెల్యే మాణిక్ రావు




