Wednesday, 4 November 2026

మ‌హిళాభివృద్ధికి సింగ‌రేణి పెద్ద‌పీట‌

 

 

 

 

 

జీఎం(కో ఆర్డినేష‌న్‌) ఎం.సురేశ్‌…..

“మ‌హిళా ఓ మ‌హిళా” గీత ఆవిష్క‌ర‌ణ‌………మ‌హిళ చైత‌న్యానికి, ఆర్థిక అభివృద్ధి సింగ‌రేణి సంస్థ ద‌శాబ్ధాల కాలంగా ప్రోత్సాహం అందిస్తోంద‌ని, కంపెనీ అందిస్తున్న స‌హ‌కారాన్ని మ‌హిళ‌లు అందిపుచ్చుకొని ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని జీఎం(కో ఆర్డినేష‌న్‌) ఎం.సురేశ్ అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ సింగ‌రేణి భ‌వ‌న్ లో ఘ‌నంగా నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వానికి అధ్య‌క్ష‌త వ‌హిస్తూ ప్ర‌సంగించారు. స‌మాజంలో మ‌హిళా పాత్ర‌, మ‌హిళా చైత‌న్యంపై ప్ర‌ముఖ క‌వి, సింగ‌రేణి ఉద్యోగి జ‌య‌రాజు రాసిన మ‌హిళా ఓ మ‌హిళా చైత‌న్య గీతాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు.

సింగ‌రేణి సంస్థ ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ ఆదేశం మేర‌కు సింగ‌రేణివ్యాప్తంగా యువ‌తుల కోసం ప్ర‌త్యేక ఉపాధి అవ‌కాశ శిక్ష‌ణ‌లు అనేకం ఉచితంగా అందిస్తోంద‌ని, అలాగే అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. మ‌హిళ‌ల్లో మ‌రింత స్ఫూర్తి తీసుకురావ‌డం కోసం ప్ర‌ముఖ వాగ్గేయ కారుడు జ‌య‌రాజుతో పాట రూపొందించి విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న సేవా అధ్య‌క్షురాలు ఆశా సురేశ్ మాట్లాడుతూ.. మ‌హిళాభ్యుద‌యానికి సింగ‌రేణి అందిస్తున్న ప్రోత్సాహాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. సింగ‌రేణి సేవా స‌మితి వ‌ల్ల సింగ‌రేణి ప్రాంతంలో అనేక మంది యువ‌తులు స్వ‌యం ఉపాధి బాట ప‌ట్టి వారి కుటుంబాల‌కు అండ‌గా నిలుస్తున్నార‌ని తెలిపారు.

అధికారుల సంఘం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.వి.రాజ‌శేఖ‌ర‌రావు స్ఫూర్తిదాయ‌క మ‌హిళ ల గురించి వివ‌రిస్తూ భార‌త దేశంలో మ‌హిళ‌లు మ‌రింత చైత‌న్య‌వంతులు కావాల‌ని, భిన్న వృత్తుల్లో రాణించాల‌ని ఆకాంక్షించారు.

మ‌హిళా ప్ర‌తినిధి ష‌ర్మిలా మోజెస్ మాట్లాడుతూ.. మ‌హిళా విద్య‌ను ప్రోత్స‌హించేందుకు ఉద్యోగినులు త‌మ‌వంతుగా పేద విద్యార్థినుల‌ను చ‌దివించేందుకు కృషి చేయాల‌న్నారు.

మ‌హిళా చైత‌న్యంపై పాట‌లు రాసిన సింగ‌రేణి క‌వులు జ‌య‌రాజు, గ‌ణాశంక‌ర్‌, సీనియ‌ర్ ఉద్యోగులైన‌ శ ష‌ర్మిలా మోజెస్‌, శ నాగ‌మ‌ణిల‌ను ఘ‌నంగా స‌న్మానించారు. మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప‌లు పోటీల్లో విజేత‌ల‌కు అతిథులు బ‌హుతులు అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌లుగా శ్రీ‌ల‌క్ష్మి, కుమారి ల‌క్ష్మిప్రియ వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు అంద‌రినీ అల‌రించాయి. కార్య‌క్ర‌మంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ ఎన్‌.భాస్క‌ర్‌, చీఫ్ ఆఫ్ ప‌వ‌ర్ విశ్వ‌నాథ‌రాజు, ఏజీఎం(ఫైనాన్స్) రాజేశ్వ‌ర‌రావు, వివిధ విభాగాల అధిప‌తులు, ఉద్యోగులు పాల్గొన్నారు.