ఆర్ఎంపీ వైద్యుడు తిరుపతిని పరామర్శించిన ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ జనంసాక్షి :
హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు, మండల ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. కాగా సోమవారం చెల్పూర్ గ్రామంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేసేందుకువెళ్ళిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆర్ఎంపీ వైద్యుడు తిరుపతిగౌడ్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుడు తిరుపతిగౌడ్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్, ఎంపిటిసి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎంపీ వైద్యుడు తిరుపతిని పరామర్శించిన ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి




