ఆర్జియూకేటీ విద్యార్థులు అథ్లెటిక్స్ క్రీడలో విజయం…
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్. 28
తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్న అథ్లెటిక్ పోటీలలో ఆర్జీయూకేటి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అండర్ 16 అంతర్ జిల్లాల పోటీలలో పాల్గొన్న విద్యార్థులు పి. సంజయ్ షాట్ పుట్ లో మొదటి బహుమతిని, పి. యశ్వంత్ కుమార్ 1600 మీటర్ల పరుగు పందెంలో రెండో బహుమతిని, ఎస్.మాధవి 80 మీటర్ల పరుగు పందెంలో రెండవ బహుమతిని, సఫియా తయాబా షాట్ పుట్ లో రెండో బహుమతిని గెలుపొందారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు పీడీలు శ్యాంబాబు, రవి కిరణ్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.




