Thursday, 5 November 2026

ఆర్టీసీని ఆదరించండి.

ఆర్టీసీని ఆదరించండి.
సత్తుపల్లి డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి

పెనుబల్లి, అక్టోబర్ 28(జనం సాక్షి)
సురక్షిత ప్రయాణం కొరకు ఆర్టీసీ బస్సులను ఆదరించాలని సత్తుపల్లి డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి కోరారు. శుక్రవారం పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామంలో సర్పంచ్ ఆళ్ళ అప్పారావు అధ్యక్షతన జరిగిన ప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రయాణికుల సౌకర్యార్థం కుప్పెనకుంట్ల గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బస్సును ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం అనేక రాయితీలు కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. ఒకటి నుండి ఏడు తరగతులు చదివే 12 సంవత్సరాల లోపు బాలురకు, ఒకటి నుండి పదవ తరగతి వరకు చదివే 18 సంవత్సరాల లోపు బాలికలకు ఉచిత బస్పాసులు అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు 50% బస్సు పాసులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులలో ప్రయాణించే విధంగా బస్సు పాస్ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. డయాలసిస్ పేషెంట్లకు కూడా ఉచిత బస్సు పాసులు, స్వాతంత్ర సమరయోధులకు ఉచిత బస్సు పాసులు అందిస్తున్నట్లు ఆమె అన్నారు. ప్రజలందరూ ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని ఆమె సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎడిసి పసుపులేటి సుబ్బారావు, సిబ్బంది కిన్నెర. ఆనందరావు, వై యన్ రావు,రెడ్డి , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.