Thursday, 5 November 2026

డీఎస్పీ సదయ్య అద్వరంలో కాటన్ సర్చ్

డీఎస్పీ సదయ్య అద్వరంలో కాటన్ సర్చ్

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్28 (జనంసాక్షి)

డిఎస్పీ సదయ్య అద్వర్యంలో మహబూబాద్ జిల్లా గార్ల మండలంలోని పెద్దకిష్టపురం గ్రామంలో 65 మంది సిబ్బందితో శుక్రవారం కాటన్ సర్చ్ నిర్వహించారు. 73120రూ విలువగల మద్యం బాటిల్లు, 48 లిటర్ల కాపు సారా, 100 కేజీ బెల్లం, 36 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడుతూ యువత మత్తు పదుర్దాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారుతూ వారి అమూల్యంమైన జీవితాలను పాడు చేసికుంటు వారి తల్లిదండ్రులకు భారం అవుతున్నారని వాటి నివారనకై ప్రతి ఒక్క గ్రామాస్థులు కృషి చోయాలని కోరారు. గ్రామంలో నేరాల నియంత్రణకు నిఘా యంత్రాలైన సీసీ కెమెరాల ఏర్పాట్లకు దాతలు ముందుకు రావాలని కోరగా దాతలు భారీగా ముందుకు వచ్చారు. వారినుండి సేకరించిన నిధులతో కమిటీ నిర్వహించి గ్రామమంతా కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపి ముందుకొచ్చిన ధాతల ఐక్యతను ఆయన కొనియాడారు. మత్తు నియంత్రణకు గ్రామస్తులంతా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గార్ల బయ్యారం సీఐ బాలాజీ, డోర్నకల్ సీఐ వెంకటరత్నం, ఎస్సైలు వెంకన్న, రమాదేవి, రాము, అరుణ్ కుమార్, రమేష్ బాబు, దిలీప్, జితేందర్, అరుణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.