Tuesday, 3 November 2026

ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితం

వనపర్తి డిపో మేనేజర్ పరమేశ్వరి

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (29): ప్రజలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణాలు చేయాలని వనపర్తి డిపో మేనేజర్ పరమేశ్వరి అన్నారు గురువారం మండల కేంద్రము లోని బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికుల సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేయడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలుఉన్నాయి కాబట్టి వీలైనంతవరకు ప్రజలు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణాలు చేయాలన్నారు గోపాల్ పేట్, చాకలి పల్లి, తూడుకుర్తి,గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేస్తామని ఆమె ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్ వెంకటేష్, ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు